హౌస్‌కీపర్‌ ఆత్మహత్యాయత్నం

house keeper commit to suicide attempt - Sakshi

ప్రిన్సిపాల్‌ వేధింపుల వల్లే

ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితురాలి వెల్లడి

ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయేషా

హుజూర్‌నగర్‌ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో హౌస్‌ కీపర్‌గా పని చేస్తున్న ఎండీ.ఆయేషా ఆదివారం ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఆయేషా పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో హౌస్‌ కీపర్‌గా పనిచేస్తోంది. ఇటీవల పాఠశాల ప్రిన్సిపాల్‌ సలీం అక్తర్‌ ఆమెపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె స్థానికంగా నివాసం ఉంటున్న అద్దె గదిలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డ్యూటీకి రాకపోవడంతో తోటి సిబ్బం ది ఆమెకు ఫోన్‌ చేసినా స్పందించలేదు. వెంటనే ఆ మె గదికి వెళ్లి చూడడంతో అపస్మారక స్థితిలో పడిఉంది. మంచం పక్కనే గల నిద్రమాత్రలను గుర్తిం చిన సిబ్బంది వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రిన్సిపాల్‌ పాఠశాలలో సిబ్బందిపై ప్రవర్తిస్తున్న తీరు వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె రోధిస్తూ తెలిపింది.

ప్రిన్సిపాల్‌ వివరణ ..
ఈ విషయమై ప్రిన్సిపాల్‌ సలీం అక్తర్‌ మాట్లాడుతూ విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో ఆయేషాను మందలించామే తప్ప దురుసుగా ప్రవర్తించామని ఆరోపించడం సరికాదన్నారు. ఆయేషా తరుచూ నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు ఉందని అదే క్రమంలో ఏదైనా జరిగి ఉంటుందే తప్ప తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top