కులాంతర వివాహం చేసుకుందని ఉరి..

Harassment On Married Women In Appanapalli At East Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని మామిడికుదురు మండలం అప్పనపల్లిలో అమానుషం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కడలి శాంతి అనే మహిళపై ఆమె అత్తమామలు మంగళవారం హత్యాయత్నం చేశారు. కర్టెన్ తాడుతో మహిళకు ఉరివేసేందుకు ప్రయత్నించగా ఆమె పెద్దగా కేకలు వేసింది. దీంతో అత్తమామలు ఆమెను కాలితో పొత్తి కడుపులో తన్నారు. బాధిత మహిళ కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోగా ఆమె ప్రాణాలతో బయటపడింది. కాగా శాంతి యూరినల్ ఆగిపోవడంతో ఆమెను హుటాహుటిన రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(మాస్టారు నీచత్వం: విద్యార్థితో)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top