గుట్కా.. ఖైనీ వ్యాపారుల అరెస్టు | Gutka And Khaini Gang Arrest | Sakshi
Sakshi News home page

గుట్కా.. ఖైనీ వ్యాపారుల అరెస్టు

Mar 24 2018 10:29 AM | Updated on Sep 26 2018 6:49 PM

Gutka And Khaini Gang Arrest - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రకాశరావు

కందుకూరు:ప్రభుత్వం నిషేధించిన, గుట్కా, ఖైనీ ప్యాకెట్లను విక్రయించడంతో పాటు, అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న 14 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో విలేకర్లకు వివరాలు వెల్లడించారు. జిల్లాలో జరుగుతున్న అక్రమ గుట్కా, ఖైనీ వ్యాపారంపై ఎస్పీ ఏసుబాబు ఆదేశాల మేరకు గత కొంతకాలంగా నిఘా ఉంచారు. దీనిలో భాగంగా రూరల్‌ ఎస్సై సి.హెచ్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. పాత నేరస్తులైన షేక్‌ చిన్నాన్యామతుల్లా, వేముల శ్రీనివాసరావు, నవ్యా శ్రీను కదలికలపై నిఘా ఉంచారు. అలాగే కందుకూరు, కావలి, నెల్లూరు, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో పర్యటించి పలువురు వ్యాపారులపై నిఘా పెట్టారు.

ఈ క్రమంలో అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. శుక్రవారం కందుకూరు సమీపంలోని సి.టి.ఆర్‌.ఐ సమీపంలో గూట్కా, ఖైనీ ప్యాకెట్లు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో అక్కడ రెండు పోలీసు బృందాలను నిఘా ఉంచారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన గుట్కా వ్యాపారులు పోలీసులు మీదుగా తమ కార్లు పోనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో తప్పించుకున్న పోలీస్‌ సిబ్బంది, మరో బృందం సాయంతో కారులో ఉడాయిస్తున్న వ్యాపారులను వెంబడించి పట్టుకున్నారు. 14 మంది నిందితులతో పాటు, రూ. 9.44 లక్షల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లు, రూ. 6760 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement