వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం | Gupta Nidhulu Found In Vikarabad District | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం

Jul 28 2019 2:56 PM | Updated on Jul 28 2019 3:11 PM

Gupta Nidhulu Found In Vikarabad District - Sakshi

సాక్షి, వికారాబాద్‌ : జిల్లాలోని ధారూర్‌ మండలం ఏబ్బనూర్‌ గ్రామంలోని గుప్తనిధులు బయటపడటం కలకలం రేపింది. కొందరు వ్యక్తులకు గుంత తవ్వే సమయంలో భారీగా వెండి నాణేలు లభించాయి. అయితే దీనిపై సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 169 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఇద్దరని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న నాణేలను పోలీసులు సీజ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement