పెళ్లయిన మరునాడే మృత్యు ఒడిలోకి..!

Groom Died After Marriage With Heart Stroke - Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు గుండెపోటుతో మృతి

చిత్తూరు ,మదనపల్లె సిటీ : పెళ్లి బాజాభజంత్రీల మోత ఆగిందో లేదో.. ఆ ఇంట చావుడప్పు ఆరంభమైంది. పెళ్లియిన మరునాడే గుండెపోటు రూపంలో మృత్యువు కొత్త పెళ్లికొడుకును తన ఒడిలోకి చేర్చుకుని పెళ్లివారింట విషాదం నింపింది. వివరాలిలా.. మదనపల్లె పట్టణంలోని ఎన్‌వీఆర్‌ వీధికి చెందిన మగ్బూల్‌ కుమారుడు మోహీన్‌బాషా (28) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఇతనికి మదనపల్లెకే చెందిన ఓ యువతితో ఆదివారం రాత్రి వివాహం జరిగింది.

రాత్రి 12 గంటల వరకు అందరూ బంధువులతో కలసి సంతోషంగా గడిపారు. అనంతరం ఇంటికి చేరుకున్నారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మోహీన్‌బాషాకు ఉన్నట్టుండి గుండెనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు అతనిని మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే మోహీన్‌బాషా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లికొడుకు మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు, నవవధువును ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top