విద్యార్థినుల పట్ల టీచర్ల అసభ్య ప్రవర్తన | girls abused by teachers | Sakshi
Sakshi News home page

విద్యార్థినుల పట్ల టీచర్ల అసభ్య ప్రవర్తన

Dec 26 2017 3:45 PM | Updated on Jun 2 2018 2:56 PM

girls abused by teachers - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : విశాఖపట్టణం జిల్లా జి.మాడుగుల జిల్లా పరిషత్‌ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ప్రాధానోపాధ్యాడితోపాటు పోలీసులకు మంగళవారం ఫిర్యాదుచేశారు. 7,9,10 తరగతుల్లో చదువుతున్న విద్యార్థినుల పట్ల సదరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని వేధింపులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పెట్టే మానసిక, శారీరక వేధింపులు భరించలేక తమ పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని, అందువల్ల పోకిరీ టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement