బొమ్మతుపాకా అని అడిగినందుకు.. బాలికపై కాల్పులు

Girl shot by a man after asks about Gun in BAREILLY - Sakshi

బరేలీ(యూపీ) :  బొమ్మతుపాకో లేక నిజమైన తుపాకో తెలుసుకోవాలనుకున్న కామిని అనే పదేళ్ల బాలికపై విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపాడో వ్యక్తి. ఉత్తర్‌ప్రదేశ్‌లో సంబాల్‌ జిల్లాలోని కుర్‌ ఫతేఘర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాల్తా గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

బాధితురాలి తండ్రి అజయ్‌ పాల్‌ మౌర్య , అతని భార్య తమ వ్యవసాయ భూమిలో పని చేసుకుంటుండగా వారి  కూతరు కామిని, కుమారుడు దగ్గరల్లోని గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో అటుగా వెళ్తున్నాడు. కామిని అతన్ని చూసి  బొమ్మ తుపాకా అడగడంతో సదరు వ్యక్తి కోపంతో ఊగిపోయి బాలికపై కాల్పులు జరిపాడు. తాను అక్కడికి చేరుకునే లోపలే బుల్లెట్‌ గాయాలతో కామిని కిందపడిపోయిందని, ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడని అజయ్‌ తెలిపారు. బాలిక చేతు, పొట్టలోకి బుల్లెట్‌లు దూసుకుపోవడంతో దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వలపన్ని నిందితుడు విద్యా రామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top