కన్నకూతురిపైనే అఘాయిత్యం  | Girl Molested By Her Father In Anantapur | Sakshi
Sakshi News home page

కన్నకూతురిపైనే అఘాయిత్యం 

Sep 7 2019 7:20 AM | Updated on Sep 7 2019 7:21 AM

Girl Molested By Her Father In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: కనురెప్పే కాటేసిన చందాన కన్న కూతురిపై ఓ తండ్రి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలో ఓ కాలనీలో నివాసముంటున్న వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె(16)ను గత కొంతకాలంగా లైంగిక వేదింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయంపై బాధిత బాలిక 1098 చైల్డ్‌లైన్‌ను ఆశ్రయిచింది. దీంతో చైల్డ్‌లైన్‌ సిబ్బంది చైల్డ్‌ వెల్ఫేర్‌కమిటీ ముందు హాజరుపరిచారు. జరిగిన విషయాన్ని తెలియజేయడంతో సీడబ్ల్యూసీ అధికారులు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. దీంతో వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి నిందితుడిపై ఫోక్సోయాక్టు కింద కేసు నమోదు చేశారు. నిందితున్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలియజేశారు. ఇది చదవండి : సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement