ప్రియుడు మోసం చేశాడని..

Girl Commits Suicide After Failure In Love At Velgatur Dharmaram - Sakshi

యువతి ఆత్మహత్యాయత్నం

నిద్రమాత్రలు మింగిన ప్రియురాలు.. పరిస్థితి విషమం

వెల్గటూరు(ధర్మపురి): ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తట్టుకోలేక నిద్రమాత్రలు మింగింది. బాధితురాలి కుటుం బసభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గ టూరు మండలం ముక్కట్రావుపేటకు చెందిన కొప్పుల స్వామి–సుశీలకు ఐదుగురు కూతుళ్లు. చిన్నకుమార్తె అనూష నాలుగేళ్ల క్రితం జగిత్యాలలోని జ్యోత్స్న ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేసింది. ఈక్రమంలో అక్కడే పనిచేస్తున్న జగిత్యాలకు చెందిన కిరణ్‌తో పరిచయం ప్రేమగా మారింది. తర్వాత అనూష కరీంనగర్‌లోని అపెక్స్‌ ఆసుపత్రిలో నర్స్‌గా చేరింది. వీరి ప్రేమాయణం మూ డేళ్లు కొనసాగింది. ఈక్రమంలో అనూష పెళ్లి చేసుకుందామనడంతో, మన కులాలు వేరని, మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని కిరణ్‌ నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని తన రూములో సూసైడ్‌ నోట్‌ రాసుకుని, స్వగ్రామం ముక్కట్రావుపేటకు చేరుకుని నిద్రమాత్రలు మింగింది. ఆలస్యంగా గమనించిన తల్లితండ్రులు ఆమెను కరీంనగర్‌ అపెక్స్‌ ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో పోరాడుతోంది. 

సూసైడ్‌ నోట్‌ వివరాలు..
‘అమ్మానాన్న నన్ను క్షమించండి. అక్కయ్యలు బావలు అమ్మనాన్నలను బాగా చూసుకోవాలి. నేను ఎంతగానో ప్రేమించిన కిరణ్‌ వారి ఫ్యామిలీ నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు. నేను ప్రాణంగా భావించిన కిరణ్‌ పెళ్లికి నిరాకరిస్తున్నాడు. పైగా మన కుటుంబాన్ని మొత్తంగా రోడ్డున పడేస్తానని బెదిరిస్తున్నాడు. ఆయన ద్వేషించడం తట్టుకోలేకపోతున్నాను. నేను ఎవ్వరినీ తెలిసి బాధపెట్టలేదు. నా చావుకు పూర్తిగా కిరణ్‌ కుటుంబమే కారణం. నాకు బతకాలని ఉంది. అందరి ఆడపిల్లల్లాగా ఉండాలని ఉంది. అయినా కిరణ్‌ పెట్టే టార్చర్‌ను భరించలేకపోతున్నాను. అందుకే అందరిని విడిచి వెళ్తున్నాను. కిరణ్‌ నా ప్రాణాలను అడిగావు కదా ఇస్తున్నాను. నేను చనిపోయాక అయినా నా ప్రేమ నిజమని నమ్ము. ఇప్పటికైనా ఆడపిల్లను అనుమానించడం మానుకో, నీవు జాగ్రత్త. లైఫ్‌ను బాగా ఎంజాయ్‌ చేసుకో. బై నిన్ను ప్రాణంగా త్రీ ఇయర్స్‌ ప్రేమించిన నీ అను’ అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top