దారుణం: బంధువులే రాబందులై..

Gang Rape On Tenth Class Girl In Haryana - Sakshi

చండీగఢ్‌: హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. పదోతరగతి చదువుతోన్న ఓ విద్యార్థికి విషం ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి మైనర్‌, మరో ఇద్దరు బాధితురాలికి బంధువులు కావడం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేహాబాద్‌ జిల్లాలోని భట్టుకలాన్‌ గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు దుండగులు మంగళవారం కిడ్నాప్‌ చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అనంతరం ఆమెను ఊరి చివర ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న మరో వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెకి విషం ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ కోల్పొంది. అనంతరం ఆమెను ఇంటికి సమీపంలో వదిలి పారిపోయారు.

కాగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. కూతురు ఆచూకీ కోసం వెతికారు. ఇంతలోనే ప్రాణప్రాయ స్థితిలో ఉన్న కూతురిని ఇంటి ముందు చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది.

కాగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గిరిలో మైనర్‌ బాలుడిని అరెస్ట్‌ చేశామని, మరో ఇద్దరు తప్పించుకున్నారని, హరియాణా డీఎస్పీ(హెడ్‌క్వార్టర్స్‌) గురుదయాళ్‌ సింగ్‌ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top