కారును ఢీకొన్న బైక్‌ | four dead in road acciedent | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న బైక్‌

Feb 6 2018 8:45 AM | Updated on Aug 30 2018 4:15 PM

కూడేరు: కూడేరు–ముద్దలాపురం గ్రామాల మధ్య సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో కారును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాలివీ.. తిరుపతి నుంచి బళ్లారికి ముగ్గురు వ్యక్తులు  కారులో బయలుదేరారు. కూడేరు మండలం అరవకూరుకు చెందిన నలుగురు వ్యక్తులు బొమ్మనాల్‌ మండలం దర్గా హొన్నూరులో ఉరుసుకు వెళ్లి స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. శివారెడ్డి తోట వద్ద రహదారి తగ్గు ఉండడం, మరోపక్క చీకటి కావడంతో అదుపుతప్పిన ద్విచక్ర వాహనం కారును ఢీకొంది.

ప్రమాదంలో ద్విచక్ర వాహనం నుజ్జుకాగా, దానిపై ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురిని చిరంజీవి, కిరణ్, కుళ్లాయప్పలుగా గుర్తించారు. మరొకరి సమాచారం తెలియాల్సి ఉంది. కారు ముందు భాగం కూడా పూర్తిగా దెబ్బతినింది. డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. విషయం తెలియగానే డీఎస్పీ వెంకటరావ్, సీఐ శివనారాయణస్వామి, ఎస్‌ఐ రాజులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, క్షతగాత్రున్ని పోలీసు వాహనంలోనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement