
సాక్షి, రాజన్న సిరిసిల్లా : హనుమాజీ పేట గ్రామంలోని పర్మిట్ రూమ్ వద్ద నలుగురు వ్యక్తులు నానా హంగామాచేశారు. మద్యం మత్తులో ఒకరిపైఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. పాత కక్షలతోనే ఒకరిపై ఒకరు ఈ దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వేములవాడ రూరల్ పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
వేములవాడ మండలం మల్లారంకు చెందిన గంగరాజు, ప్రవీణ్, జానీలతో పాటు చందుర్తి మండల మూల పల్లెకు చెందిన ప్రశాంత్‌లు పర్మిట్ రూమ్‌లో మద్యం సేవిస్తూ ఉండగా.. మాటలతో వాగ్వాదానికి దిగారు. మద్యం మత్తులో బీరుసీసాలతో కొట్టుకున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని వేములవాడ ఆసుపత్రికి తరలించారు.