భార్యల మార్పిడి; నలుగురి అరెస్ట్‌ | Four Arrested For Wife Swapping In Kerala | Sakshi
Sakshi News home page

భార్యల మార్పిడి; నలుగురి అరెస్ట్‌

Apr 30 2019 2:33 PM | Updated on Apr 30 2019 2:33 PM

Four Arrested For Wife Swapping In Kerala - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లైంగికానందం కోసం భార్యలను మార్చుకుంటున్న నలుగురు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తిరువనంతపురం: లైంగికానందం కోసం భార్యలను మార్చుకుంటున్న నలుగురు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు అలప్పుజ జిల్లాలోని కయంకుళం పట్టణంలో ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొత్త వారితో లైంగిక చర్యలో పాల్గొనాలని తన భర్త వేధించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కొంత కాలంగా సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న ఈ వ్యవహారం రట్టు కావడంతో కేరళలో కలకలం రేగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది మార్చిలో ‘వైఫ్‌ స్వాపింగ్‌’  ఇక్కడ ప్రారంభమైంది. సోషల్‌ మీడియా యాప్‌ ‘షేర్‌ చాట్‌’లో పరిచయమైన కాలికట్‌కు చెందిన అర్షద్‌ అనే వ్యక్తితో ఏకాంతంగా గడపాలని తన భర్త వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా బాధితురాలి భర్తతో పాటు నలుగురిని అరెస్ట్‌ చేసి, ఐపీసీ 366 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టైన వారిలో కిరణ్‌, సీది, ఉమేశ్‌, బ్లెసరిన్‌ ఉన్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement