చైనాలో వరదలు..ఐదుగురి మృతి

Five Killed In China Floods  - Sakshi

బీజింగ్‌: చైనాలో సంభవించిన అకస్మాత్తు వరదలకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది అదృశ్యమయ్యారు. చైనాలోని యున్నాన్‌ ప్రావిన్స్‌లో ఈ వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో మెంగ్‌డాంగ్‌ టౌన్‌షిప్‌ అతలాకుతలం అయింది. వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. కరెంటు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజలు అందకారంలో మునిగిపోయారు.  మెటియోరాజికల్‌ అధికారులు ఎమెర్జిన్సీ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే భద్రతా బలగాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top