ఫింగర్‌ ప్రింట్‌ స్కాం విచారణ.. షాకింగ్‌ నిజాలు.. | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 28 2018 9:27 PM

Fingerprint Scam Investigation First Day Over In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫింగర్‌ ప్రింట్‌ స్కాం నిందితుడు సంతోష్‌ విచారణ మొదటి రోజు ముగిసింది. నిందితుడు సంతోష్‌ను ఐబీ, రాష్ట్ర కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌లు గురువారం విచారించాయి. టార్గెట్‌ పూర్తి చెయ్యడానికే ఫేక్‌ వేలిముద్రల తయారీ చేపట్టినట్లు అతను అంగీకరించాడు. విచారణలో వెల్లడైన అంశాలు.. ఈ వ్యవహారం గత 8నెలలుగా సాగుతుందని అతను చెప్పాడు. దాదాపుగా 1400లకు పైగా డాక్యుమెంట్ల డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలిసింది. అంతేకాక 3వేలకుపైగా వేలిముద్రలు సేకరించి, 3వేల నుంచి 4వేల సిమ్‌ కార్డ్స్‌ యాక్టివేట్‌ చేసినట్లు సమాచారం.

ల్యాండ్‌ డాక్యుమెంట్ల నుంచి వేలి ముద్రలు సేకరించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఇండియన్‌ మార్ట్‌ అనే సంస్థ నుంచి ఫింగర్‌ ప్రింట్‌ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. సిమ్‌కార్డులను, ఫేక్‌ ఫింగర్‌ ప్రింట్‌లను దగ్ధం చేసినట్లు నిందితుడు తెలిపాడు. వెస్ట్‌ జోన్‌ పోలీసులతో పాటు, ఐబీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌లు సంతోష్‌ను విచారించారు.


 

Advertisement
Advertisement