కన్న తండ్రే కాటేశాడు

Father Molestation on Daughter in East Godavari - Sakshi

కుమార్తెపై లైంగిక దాడికి తెగబడిన కామాంధుడు

పోక్సో, దిశ చట్టం కింద కేసు నమోదు

రాయవరం:  కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన ఓ తండ్రి బాగోతమిది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాకలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన బాలిక రామచంద్రపురంలోని హాస్టల్‌లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి, సోదరుడు నాయనమ్మతో కలిసి వెదురుపాకలో నివాసం ఉండటంతో పండగ సెలవులకు ఆదివారం ఇంటికి వచ్చింది. ఆ రాత్రే ఆమెకు కన్న తండ్రి కాళరాత్రిని చూపించాడు.

విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మిన్నకుండి పోయింది. సోమవారం రాత్రి తిరిగి మరోసారి లైంగిక దాడికి తెగబడటానికి ప్రయత్నిస్తుంటే ఆమె పక్కింటికి పారిపోయి, ఫోన్లో సమీప బంధువులకు తెలిపింది. స్థానికులు ఈ విషయాన్ని 100 నంబరుకు ఫోన్‌ చేసి చెప్పడంతో ఎస్సై ఎల్‌.శ్రీనివాసనాయక్‌ ఘటనా స్థలికి వెళ్లి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి, అనపర్తి సీఐ ఎన్‌వీ భాస్కరరావు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. గతంలోనూ ఆ చిన్నారిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడటానికి ప్రయత్నించగా స్థానికులు దేహశుద్ధి చేసినట్లు సమాచారం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top