మాజీ ఎమ్మెల్యే వీరేశంను విచారిస్తాం : ఎస్పీ

Ex MLA Veeresham Will Be Interrogated Says SP Ranganath - Sakshi

సాక్షి, నల్గొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసు లో మొత్తం 7  గురు నిందితులు ఉన్నారని ఎస్పీ రంగనాథ్‌ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ హత్యకు సంబంధించి మొత్తం కోటి రూపాయల డీల్ జరిగినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 18  లక్షలు  అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు తెలిపాడు. నల్గొండ గ్యాంగ్ తో కలిసి  బీహార్ గ్యాంగ్ సుపారీ తీసున్నారని వివరించారు. దీనిలో భాగమైన మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. వీరితో పాటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశంని కూడా విచారిస్తామని అన్నారు.  నల్గొండ కి చెందిన మాజీ ఐసిస్‌ టెర్రరిస్ట్ లు  ప్రణయ్ హత్య కేసు లో ఇన్వాల్వ్ అయ్యారని, ప్రణయ్‌ను చంపిన వాడు బీహార్‌కు చెందినవాడని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top