
కాలేజీలో ఉండగానే బాషా ఇలా చేసి ఉండొచ్చని..
సాక్షి, కడప: జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. బోయినపల్లి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న మహబూబ్ బాషా (20) శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీలో ఉండగానే విషం తాగినట్లు తెలుస్తోంది. అయితే, సత్వరమే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదనీ, వైద్యుల నిర్లక్ష్యమే బాషా ప్రాణాలు తీసిందని అతని స్నేహితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.