ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు : షాకింగ్‌ వీడియో | A drunk person drove his car over pedestrians | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు : షాకింగ్‌ వీడియో

Aug 19 2019 9:06 AM | Updated on Aug 19 2019 4:21 PM

A drunk person drove his car over pedestrians - Sakshi

సాక్షి, బెంగళూరు : మద్యం మత్తులో వాహనాన్ని పాదచాలరులపైకి  దూకించిన ఘటన బీభత్సం సృష్టించింది. అతిగా మద్యం సేవించిన డ్రైవర్‌, వాహనంపై పట్టుకోల్పోడంతో, అదుపు తప్పిన కారు బిజీగా ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో పలువురు పాదచారులు గాయాలపాలయ్యారు. బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌ ప్రాంతంలో  ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ షాకింగ్‌ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 

కేసు నమోదు చేసిన పోలీసులు, కారు డ్రైవర్‌ రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు.  గాయపడిన వారిలో గౌతమ్, శంకర్‌ అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement