కూతురు ఫోన్‌లో అశ్లీల వీడియో.. తండ్రిపై లైంగిక కేసు

Daughter File Molestation Case On Father In Ranchi - Sakshi

కూతురి అశ్లీల వీడియో చూసిన తండ్రిపై కేసు

రాంచీ : ‘తప్పుడు పని’ చేసినందుకు మందలించిన తండ్రిపై లైంగిక కేసు పెట్టింది ఓ కూతురు. తన స్వేచ్ఛకు అడ్డువస్తున్నాడని, తనను బయటకు వెళ్లనివ్వడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటగా మానసికంగా హింసిస్తున్నాడని చెప్పిన యువతి.. మరుసటి రోజు వచ్చి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ నగరంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచీలో నివాసముంటున్న ఓ వ్యక్తి తన కూతురు ఫోన్‌ పాడవడంతో బాగు చేయించడానికి ఓ రిపేర్‌ షాప్‌కి తీసుకెళ్లాడు. అక్కడ ఫోన్‌ లాక్‌ తీసి చూడగా కుమార్తే అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో ఆగ్రహించిన తండ్రి.. ఇంటికెళ్లి కూతురిపై చేయి చేసుకున్నాడు. ఇకపై బయటకు వెళ్లేది లేదంటూ ఆంక్షలు విధించాడు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తల్లిని తోడుగా తీసుకెళ్లాలని షరతులు విధించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న యువతి.. తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. అయితే తండ్రిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయమని పోలీసులు సూచించగా.. అందుకు ఆమె నిరాకరించి వెళ్లిపోయింది.

మరుసటి రోజు మేనమామతో కలిసి వచ్చి తన తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ‘ యువతి ఫిర్యాదుపై అనుమానం ఉంది. మొదటగా మానసికంగా వేధిస్తున్నారని చెప్పిన యువతి.. మరుసటి రోజు వచ్చి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తండ్రితో కలిసి ఉండనని, మేనమామతో ఉంటానని చెప్పింది. ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టాం. యువతి ఆరోపణలు నిజమైతే తండ్రిపై చర్యలు తీసుకుంటాం’  అని సీనియర్‌ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top