పోలీస్‌ అధికారి కుమార్తెపైనే..!?

Daughter of Cop Couple Gangraped - Sakshi

సాక్షి, భోపాల్‌ : మధ్య ప్రదేశ్‌లోనూ మహిళలపై అత్యాచార పర్వం కొనసాగుతోంది. తాజాగా భోపాల్‌లోని హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర ఒక యవతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి మూడు గంటలపాటు అత్యాచారం చేశారు. ఇదిలా ఉండగా బాధిత యువతి తల్లిదండ్రులు ఇద్దరూ పోలీసు ఉన్నతాధికారులు కావడం గమనార్హం. బాధిత యువతి ఎంపీ నగర్‌ ప్రాంతంలో సివిల్‌ సర్వీసెస్‌కు కోచింగ్‌ తీసుకుని ఇంటికి వస్తుండగా.. దుండగులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు.

ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వ రైల్వే పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిందని ఆయన తెలిపారు. అత్యాచారం చేస్తున్న సమయంలో బాధిత యువతి.. తనపై ఘాతుకానికి పాల్పడవద్దని వేడుకుందని ఆయన చెప్పారు. నాలుగురు యువకులు అత్యాచారం చేశాక.. టీ తాగి, గుట్కా తిని వెళ్లిపోయారని తెలిపారు. నిందితులైన నలుగురు యువకులను గోలు, అమర్‌, గంటూ, రాజేష్‌గా గుర్తించినట్టు హబీబ్‌గంజ్‌ పోలీసులు తెలిపారు. ఈ నలుగురిపై 376డీ, 34 సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top