
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చిత్తూరు/శ్రీకాళహస్తి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మనస్పర్ధల కారణగాంగా భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి ఇద్దరి ఆడపిల్లలు అనాధలుగా మిగిలారు. వివరాలు.. మునికుమార్ (40), మాధవి (36) దంపతులు శ్రీకాళహస్తి పట్టణంలోని కర్ణల వీధిలో నివాసముంటున్నారు. వీరికి మునిశ్రావణి (15), మునిసాయి (12) సంతానం. మునికుమార్ తిరుమలలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గతరాత్రి కూడా దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందనీ.. ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.