
సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇద్దరు భార్యభర్తలు నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టారు. నిరుద్యోగులనుంచి కోట్లరూపాయలు వసూళు చేసి ఉడాయించారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. కొప్పశెట్టి గోపాల్, భారతి లక్ష్మీ అనే ఇద్దరు భార్యాభర్తలు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి కోట్లరూపాయలు వసూళు చేశారు. రాజముద్రతో కూడిన నకిలీ నియామకపత్రాలను వారికి అందజేశారు.
విషయం బయటపడుతుందనే భయంతో ఊరునుంచి పరారయ్యారు. తమకిచ్చినవి నకిలీ నియామకపత్రాలని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భార్యభర్తలపై ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ సైతం నమోదైంది. కాగా గత నెల 21న ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.