నా చావుకు కారణం సుజితనే.. | computer operator committed to suicide attempt | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 3 2018 9:15 PM | Last Updated on Sat, Feb 3 2018 9:23 PM

computer operator committed to suicide attempt - Sakshi

ఆత్మహత్యాయత్నం చేసిన శివపార్వతి

సాక్షి, ఒంగోలు : ఉన్నతాధికారి వేధింపులు భరించలేక కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా తాళ్లూరు కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో శివపార్వతి కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. అయితే గత కొంత కాలంగా స్పెషల్ ఆఫీసర్ సుజిత, తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో ఆరోపించింది. వేధింపులు భరించలేకే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు పేర్కొంది. తన చావుకు కారణం స్పెషల్‌ ఆఫీసర్‌ సుజితనే కారణం అని వీడియోలో తెలిపింది.

వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా శివపార్వతి విధులకు ఆలస్యంగా వస్తుందని, మందలించడంతో మనస్తాపం చెంది శివపార్వతి ఆత్మహత్యా యత్నం చేసిందని పాఠశాల వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement