
చెడ్డి గ్యాంగ్ ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హైదరాబాద్‌లో హల్‌చల్ చేస్తోంది. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడతోంది. గొల్కొండ, ఆల్ కరీం కాలనిల్లోకి ఈ నెల 15న రాత్రి చెడ్డి గ్యాంగ్ చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజ్ సాయంతో దొంగలను గుర్తించారు. చెడ్డి గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు
బనియన్, నిక్కరు ధరించి రాత్రి వేళల్లో దొంగతనం చేయడం చెడ్డిగ్యాంగ్ ప్రత్యేకత. చోరీ సమయంలో ఎవరికీ పట్టుబడకుండా చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ఒళ్లంతా నూనె రాసుకుంటారు. దొంగతనానికి పాల్పడే సమయంలో అవసరమైతే హత్యకు కూడా చెడ్డీగ్యాంగ్ వెనుకాడదు.