డేరా బాబాపై ఛార్జిషీటు దాఖలు

CBI files chargesheet against rape convict Dera chief - Sakshi

చండీగఢ్‌: రేప్‌ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం, ఆయన ఇద్దరు అనుచరులపై సీబీఐ గురువారం ఛార్జిషీటు దాఖలు చేసింది. గుర్మీత్‌ రామ్‌ రహీం తన ఆశ్రమంలో పని చేసే ఇద్దరు యువతులపై  అత్యాచారం చేయడంతో కోర్టు ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరో రెండు హత్య కేసుల్లో కూడా గుర్మీత్‌ రామ్‌ రహీం నిందితుడిగా ఉన్నాడు. డేరా ఆశ్రమంలోని తన అనుచరులను నపుంసకులుగా మార్చారనే ఆరోపణలపై పంజాబ్‌, హర్యానా హైకోర్టు విచారణకు ఆదేశించిన 3 సంవత్సరాల తర్వాత సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.
 
డేరా ఆశ్రమ చీఫ్‌ గుర్మీత్‌ మాజీ అనుచరుడు హన్స్‌రాజ్‌ చౌహన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనతో పాటు ఆశ్రమంలో పనిచేస్తున్న 400 మంది అనుచరులను డేరా ఆశ్రమంలో నపుంసకులుగా మార్చివేశాడని హన్స్‌రాజ్‌ చౌహన్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. గుర్మీత్‌ రామ్‌ రహీం రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top