పేపర్లు దిద్దడం,మార్కులు వేయడం అంతా విద్యార్థులే!

Brutal in vulavapadu school - Sakshi

 ఉలవపాడు ఉన్నత పాఠశాలలో దారుణం 

 వార్షిక పరీక్షల పేపర్లు బహిర్గతం

ఉలవపాడు : ఓ వైపు విద్యాశాఖ తాము వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని గొప్పలు చెబుతుంది...తీరా పరిస్థితి చూస్తే వాస్తవానికి విరుద్ధం. వివరాలలోకి వెళితే పకడ్బందీ అంటూ పేపర్లు ఇచ్చేటప్పుడు పోలీస్‌స్టేషన్‌కు పంపి అక్కడ నుంచి పాఠశాలకు చేర్చి అనంతరం పరీక్షలు నిర్వహించారు.

కానీ పరీక్షలు జరిపారు. ఆ తరువాత విద్యార్థులు రాసిన పేపర్లను బహిర్గతం కాకుండా దిద్ది నిజమైన మార్కులు అందచేయాలి. కానీ ఉలవపాడు ఉన్నత పాఠశాలలో పరిస్థితి చాలా దారుణం. సోమవారం ఉలవపాడు ఉన్నత పాఠశాలలో పాత రూంలలో ఏడో  తరగతి విద్యార్థులే తాము రాసిన పేపర్లను రుద్దుకుంటున్నారు.

తమకు నచ్చిన విధంగా మార్కులు వేసుకునే పరిస్థితి. ఉపాధ్యాయులు పరీక్ష రాసిన తరువాత రహస్యంగా జరగాల్సిన కార్యక్రమం కాస్తా బహిర్గతం చేయడం అదీ పరీక్షలు రాసిన విద్యార్థుల చేతే వారి పేపర్లు రుద్దిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  

వారి పేపర్లు కాకుండా పక్క క్లాసు పేపర్లు కూడా దిద్దుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానోపాధ్యాయురాలి అండతోనే ఈ కార్యక్రమం జరుగుతుందని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రధానోపాధ్యాయురాలు కొండపి ఎమ్మెల్యే స్వామి అక్క కావడంతో విద్యాశాఖ నుంచి తమను ఎవరూ పట్టించుకోరు అని ఉపాధ్యాయులు బాహాటంగా చెబుతున్నారు.

కానీ ఏడాది కాలంగా వివాదాల మధ్య నడుస్తున్న ఈ పాఠశాలలో ఇలా పేపర్లు విద్యార్థులు దిద్దడం చూసిన తరువాత ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటే వెనుక్కు తగ్గే పరిస్థితిని ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కల్పించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top