
నిందితులు పూర్ణేశ్, సాహిల్, కిశోర్
సాక్షి, కర్ణాటక ,కృష్ణరాజపురం: స్పా సెంటర్ ముసుగులో వేశ్యావాటిక నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం రామ్మూర్తినగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పూర్ణేశ్, సాహిల్,కి శోర్‌లు రామ్మూర్తినగర్‌లో అస్నోటిక్ స్లిమ్ అండ్ స్పా సెంటర్ ముసుగులో వివిధ ప్రాంతాల నుంచి తరలించిన యువతులతో బలవంగా వేశ్యావాటిక నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న రామ్మూర్తినగర్ పోలీసులు మంగళవారం స్పా సెంటర్‌పై దాడి చేసి ముగ్గరు యువతులను రక్షించి నిందితులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.