ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు | Bomb threat to airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

Sep 4 2019 3:27 AM | Updated on Sep 4 2019 5:29 AM

Bomb threat to airport - Sakshi

శంషాబాద్‌: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుస్తానంటూ ఓ వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. సాయిరాం కాలేరు అనే పేరు మీద వచ్చిన ఈ మెయిల్‌ మంగళవారం మధ్యాహ్నం 2.31 గంటలకు ఎయిర్‌పోర్టులోని ఆర్‌జీఐఏ కస్టమ్స్‌ సపోర్ట్‌ మెయిల్‌ ఐడీకి చేరింది.  సంబంధిత అధికారులు వెంటనే భద్రతా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మెయిల్‌లో ‘ఐ వాంట్‌ టు బ్లాస్ట్‌ బాంబ్‌ ఇన్‌ ఎయిర్‌పోర్టు టుమారో’అని ఉంది. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు సీఐఎస్‌ఎఫ్, సైబరాబాద్‌ పోలీసులతో పాటు కేంద్ర పౌర విమానయాన భద్రత అధికారులకు సమాచారం అందించారు.

ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసి కేసు దర్యాప్తును ప్రారంభించారు. rairamka eru@ ive.com ఐడీతో వచ్చిన మెయిల్‌ను సైబరాబాద్‌ సైబర్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్తగా దేశీయ, అంతర్జాతీయ అరైవల్, డిపార్చుర్‌ టెర్మినళ్లతో పాటు పార్కింగ్‌ ఏరియాలను డాగ్‌స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement