వాకింగ్‌కు వెళ్లిన బీజేపీ నేత హత్య..!! | BJP Leader Manoj Thackeray Found Dead On Road In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

వాకింగ్‌కు వెళ్లిన బీజేపీ నేత హత్య..!!

Jan 20 2019 12:57 PM | Updated on Mar 28 2019 8:37 PM

BJP Leader Manoj Thackeray Found Dead On Road In Madhya Pradesh - Sakshi

మనోజ్‌ థాకరే (పాత చిత్రం)

సాక్షి, భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని బర్వానీ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత మనోజ్‌ థాకరే మృతి చెందారు. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మనోజ్‌ గ్రామంలోని రాధా స్వామి భవన్‌ సమీపంలో విగతజీవిగా కనిపించినట్టు బర్వానీ ఏఎస్పీ చెప్పారు. మృత దేహానికి కొద్ది దూరంలో రక్తపు మరకలతో కూడిన ఒక రాడ్‌ను కనుగొన్నట్టు తెలిపారు. దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.

మనోజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని వర్ల పోలీస్‌స్టేషన్‌ ఇన్స్‌చార్జి దినేష్‌ కుశ్వాహ అనుమానం వ్యక్తం చేశారు. కాగా, రాజకీయ నేతల వరుస హత్యలు మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం మంద్‌సౌర్‌ మన్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ ప్రహ్లాద్‌ బంధ్‌వార్‌ను దుండగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.  ప్రహ్లాద్‌ హత్య కేసుతో సంబంధాలున్నాయని రాజస్థాన్‌లోని ప్రతాపఘర్‌లో మనీస్‌ బైరాగి అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement