స్కూల్లోనే బాలికపై క్లాస్‌మేట్స్‌ మృగవాంఛ

Bihar Teen Raped In School For 7 Months By Students - Sakshi

తొమ్మిదో తరగతి చదివే బాలికకు స్కూల్‌ నరకాన్ని తలపించింది. ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు, విద్యార్థులు సహా ఏకంగా 18 మంది ఏడు నెలలుగా ఆమెపై మృగవాంఛ తీర్చుకుంటున్నారు. బాధితురాలు ధైర్యం చేయటంతో చివరకు విషయం వెలుగులోకి రాగా.. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే... 

పట్నా: బిహార్‌లోని ఛప్రా జిల్లా పర్సాఘడ్‌లోని ఓ స్కూల్‌లో బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గతేడాది డిసెంబర్‌లో ఓ కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరైన ఓ క్లాస్‌మేట్‌ ఓదార్చినట్లు నటించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత స్కూల్‌ ప్రిన్స్‌పాల్‌, మరో ఇద్దరు టీచర్లు సహా ఐదుగురు విద్యార్థులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారికి జత కలిసిన మరికొందరు విద్యార్థులు అప్పటి నుంచి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ ఏడు నెలలుగా మృగవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ మధ్యే తండ్రి జైలు నుంచి విడుదల కావటంతో జరిగిన దారుణాన్ని అతనికి చెప్పుకుని కూతురు విలపించింది. దీంతో ఎక్మా పోలీస్‌ స్టేషన్‌లో తండ్రిసాయంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రిన్సిపాల్‌తోపాటు ఓ టీచర్‌ను, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు అధికారి అజయ్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం తరలించిన అధికారులు.. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top