మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్‌

Bihar Mob lynching In 32 People Arrested - Sakshi

పట్నా: దేశంలో మూకదాడులు రోజురోజకీ పెరిగిపోతున్నాయి. తాజాగా బిహార్‌లో మరో మూకదాడి చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన పట్నాకి సమీపంలోని దానాపూర్‌లో శనివారం జరిగింది. చిన్న పిల్లలను ఎత్తుకు పోతున్నారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలు కావడంతో అక్కడిక్కడికే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్పడిన 32 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అనంతరం మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా శాంతి భద్రతల సమస్యను అదుపులో ఉంచుతామని సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. దీనిపై అధికార జేడీయూ నేత స్పందిస్తూ.. పోలీసులు ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఇదే ప్రాంతంలో గత జూలై 30న సైతం ఒక వ్యక్తి మూకదాడిలో మరణించిన విషయం తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top