
సాక్షి,బెంగళూరు: ‘నేను ఫ్రీ బర్డ్’ అంటూ హాయ్ బెంగళూరు వార పత్రిక సంపాదకుడు రవి బెళగెరె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. సహచరుడు సునీల్ హెగ్గెరహళ్లిని చంపడానికి సుపారీ ఇచ్చిన కేసులో బెయిల్ లభించిన ఆయన ఈనెల 21 నుంచి పోలీసుల సమక్షంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యం కొంత మెరుగు పడటంతో ఆయన శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆసుపత్రి వైద్యుల సూచనమేరకు ఆయన్ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన ఆయన నేను ఇక ఫ్రీ బర్డ్‌ను అంటూ పోస్ట్ చేశారు. నెటిజన్లు త్వరలోనే ఈ కేసులో కూడా ఫ్రీ బర్డ్ అవుతారు అంటూ ప్రతిస్పందించారు.