
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఓ మహిళా అనుమానాస్పదంగా మృతి చెందింది. అభ్యుదయనగర్‌లోని ఒయో లాడ్జిలో బుధవారం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్న విచారణ ప్రారంభించారు. విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి. మృతిచెందిన మహిళను బెంగాల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంగీతగా గుర్తించారు. మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయిన లోకేష్ అనే యువకుడి కోసం సంగీత హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.
గత మూడు రోజులుగా లోకేష్, సంగీత కలిసి ఒయో లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరగిందని లాడ్జి సిబ్బంది తెలిపారు. దీంతో సంగీత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంగీతకు 48ఏళ్లు కాగా, లోకేష్‌కు 28 ఏళ్లు ఉండొచ్చని విచారణలో వెల్లడైంది. కాగా లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిపారు.