ఏటీఎం కార్డు బ్లాక్‌ అయిందని.. | Sakshi
Sakshi News home page

ఏటీఎం కార్డు బ్లాక్‌ అయిందని..

Published Sat, Mar 24 2018 10:59 AM

Atm Card Fruad In Kurnool - Sakshi

కొలిమిగుండ్ల: బెలుం గ్రామానికి చెందిన బాచం వెంకటశివారెడ్డి సైబర్‌ నేరస్తుల చేతిలో మోసపోయాడు. ఇతను ఈనెల 19న కొలిమిగుండ్ల స్టేట్‌ బ్యాంక్‌లో డీడీ తీసేందుకువచ్చాడు. ఈక్రమంలో స్టేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను మాట్లాడుతున్నానని శివారెడ్డి సెల్‌కు గుర్తుతెలియని వ్యక్తి  ఫోన్‌ చేశాడు. మీ ఏటీఎం కార్డు బ్లాక్‌ అయిందని, ఆధార్‌ అనుసంధానం చేయించుకోవాలని సూచించాడు. కార్డు బాగానే ఉందని చెప్పినా వరుసగా ఫోన్‌ చేస్తూ వచ్చాడు. చివరకు బెలుంకు వెళ్లాక మరోసారి ఫోన్‌ వచ్చింది. దీంతో నిజమే అనుకొని  ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలు, ఆతర్వాత ఓటీపీ నంబర్‌ కూడా చెప్పాడు. దీంతో  శివారెడ్డి అకౌంట్‌ నుంచి రెండు విడతల్లో రూ.15,500  డ్రా అయింది.  తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం బ్యాంకు అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement