రైల్వే శాఖ మార్గదర్శకాలు విడుదల
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సాధారణ రైలు ప్రయాణికులకు పారదర్శకత, సౌకర్యవంతమైన సేవలు అందించే దిశగా రైల్వే శాఖ ఓటీపీ ఆధారిత తత్కాల్ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచి్చంది. పైలట్ ప్రాజెక్ట్‌గా 52 రైళ్లకు సంబంధించి చేపట్టిన ఈ విధానం విజయవంతం కావటంతో త్వరలో మిగిలిన అన్ని రైళ్లకూ వర్తింప చేయనుంది.
నవంబర్ 17 నుంచి రిజర్వేషన్ కౌంటర్‌లలో కూడా ఓటీపీ ఆధారిత తత్కాల్ రిజర్వేషన్ వ్యవస్థను ప్రాంభించిన విషయం తెలిసిందే. ఈ విధానంలో ప్రయాణికుడు రిజర్వేషన్ ఫారమ్‌లో ఇచి్చన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే టికెట్ నిర్ధారణ అవుతుంది.


