
శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దుకు అవతలి వైపు నుంచి పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత్ సైనికాధికారులు మృతి చెందారు. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి(ఎల్‌వోసీ) శుక్రవారం పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారులు(జేసీవోలు) ఇద్దరు నేలకొరిగారని సైన్యం తెలిపింది. పాక్ దుశ్చర్యను భారత్ బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయని పేర్కొంది.