కోట్లు పోగొట్టుకున్న సల్మాన్‌ సోదరుడు! | Arbaaz Khan Lost Crores to Bookie Sonu Jalan | Sakshi
Sakshi News home page

Jun 1 2018 8:13 PM | Updated on Jun 1 2018 8:45 PM

Arbaaz Khan Lost Crores to Bookie Sonu Jalan - Sakshi

అర్బాజ్‌ఖాన్‌ (ఫైల్‌ ఫొటో)

ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) బెట్టింగ్‌ స్కాంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌కు సమన్లు అందిన విషయం తెలిసిందే. బుకీల ద్వారా బెట్టింగ్‌కు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. విచారణకు హాజరు కావాలని అర్భాజ్‌కు థాణే పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పట్టుబడ్డ బుకీ సోనూ జలాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే టైమ్స్‌నౌ చానెల్‌ తెలిపిన వివరాల ప్రకారం అర్బాజ్‌ఖాన్‌ బెట్టింగ్‌లో కోట్ల రూపాయలు పోగట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ బెట్టింగ్‌ స్కాంలో బాలీవుడ్‌ పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు మూడు కోట్ల రూపాయలను అర్బాజ్‌ఖాన్‌ పోగొట్టుకున్నాడని, ఈ డబ్బులు సోనూ జలన్‌కు ఇవ్వక పోవడంతో అతను బ్లాక్‌ మెయిల్‌కు దిగినట్లు, అయినా అర్బాజ్‌ఖాన్‌ స్పందించకపోవడంతో అతని పేరు బయట పెట్టినట్లు తెలుస్తోంది. అర్బాజ్‌ఖాన్‌ తనకు తెలసిన వ్యక్తులతో ఈ ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లను ఫిక్స్‌ చేసినట్లు జలాన్‌ పోలీసు విచారణలో వెల్లడించాడని టైమ్స్‌ నౌ పేర్కొంది. జలాన్‌కు అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావుద్‌తో సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మే 16న ముంబైలోని డొంబీవిలీలో నలుగురు బుకీలను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. కల్యాణ్ సెషన్స్‌కోర్టు పరిసరాల్లో సోను జాలాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ కేంద్రంగా బెట్టింగ్‌లకు పాల్పడిన దావుద్‌ ముఠాలోని అనిల్‌ తుండా, రయిస్‌ ఫరుఖీలతో జాలాన్‌ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవాడు. బెట్టింగ్‌ వివరాలన్ని జలాన్‌ డైరీలో పుసగుచ్చినట్టు రాసుకున్నాడు. ఈ డైరీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

బెట్టింగ్‌లతో ఏం చేయలేరు..
బెట్టింగ్‌లు క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం చూపవని బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ మాజీ అధికారి నీరజ్‌ కుమార్‌ తెలిపారు. బాలీవుడ్‌ స్టార్స్‌ అయినా, బుకీలు నేరుగా క్రికెటర్లను సంప్రదించినా క్రికెట్‌కు ఏం కాదన్నారు. జూదం చట్టరీత్యా నేరమని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement