ఆరుకు చేరిన మృతుల సంఖ్య | Another Man Dead In Palamaner Road Accident | Sakshi
Sakshi News home page

పలమనేరు రోడ్డు ప్రమాదం : ఆరుకు చేరిన మృతుల సంఖ్య

Sep 19 2019 6:53 AM | Updated on Sep 19 2019 9:44 AM

Another Man Dead In Palamaner Road Accident - Sakshi

సాక్షి, చిత్తూరు : పలమనేరు రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ టీటీడీ ఉద్యోగి విష్ణు మృతి చెందాడు.  ఈ నెల(సెప్టెంబర్‌)14న తిరుపతికి చెందిన విష్ణు తన  కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. తన సోదరిని బెంగళూరులో దింపేందుకు కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తుండగా పలమనేరు నియోజవర్గ పరిధిలోని టీటీడీ గోశాల వద్ద అదుపు తప్పి రోడ్డుకు ఎడమ వైపు రెయిలింగ్‌ను ఢీకొని వంద మీటర్ల దూరంలో ఎగిరిపడింది. కారు ఇంజన్‌ రెయిలింగ్‌ను రాసుకోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగి పెట్రోల్‌ ట్యాంకుకు నిప్పంటుకుంది.

(చదవండి : ప్రాణం తీసిన అతి వేగం)

సగం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్న విష్ణును సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు రక్షించి 108లో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి రిఫర్‌ చేశారు. చికిత్స పొందుతూ విష్ణు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే  విష్ణు భార్య జాహ్నవి (35), కుమారుడు పవన్‌రామ్‌ (13), కుమార్తె అస్త్రిత (10), విష్ణు సోదరి కళ (42), ఆమె కుమారుడు భానుతేజ (19) మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement