ఏఎంయూ ప్రొఫెసర్‌పై సంచలన ఆరోపణ | AMU Professor Triple Talaq in Whats App | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో ఏఎంయూ ప్రొఫెసర్‌ ట్రిపుల్‌ తలాక్‌

Nov 12 2017 12:52 PM | Updated on Nov 12 2017 12:52 PM

AMU Professor Triple Talaq in Whats App - Sakshi

ఆగ్రా : ఇస్లాం మత విధానాలకు విరుద్ధంగా ఉందని విమర్శలు ఎదుర్కుంటున్న ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు తాత్కాలిక నిషేధం విధించినా కొందరు మాత్రం ఇంకా దానిని అనుసరిస్తూనే ఉన్నారు. తాజాగా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఒకరు తన భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులివ్వటం కలకలం రేపుతోంది. 

యూనివర్సిటీ సంస్కృత భాషా విభాగాన్ని చైర్మన్‌ అయిన ప్రొఫెసర్‌ ఖలీద్ బిన్ యూసఫ్ ఖాన్ తన భార్యకు వాట్సాప్‌ ద్వారా తలాక్‌ సందేశం పంపారు. ఆపై మరో టెక్స్ట్ మెసేజ్ పెట్టి తలాఖ్ చెప్పాడు. అటుపై ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. దీనిపై బాధితురాలు యాస్మీన్ ఖలీద్ మాట్లాడుతూ, వచ్చే నెల 11వ తేదీలోగా తనకు న్యాయం జరగకపోతే తన ముగ్గురు బిడ్డలతో కలిసి వీసీ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

న్యాయం కోసం తాను యూనివర్సిటీలోని క్రింది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందర్నీ వేడుకుంటున్నానని, అయినా తనకు ఎవరూ సహాయపడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించిన ప్రొఫెసర్ ఖలీద్... తాను షరియత్ చట్టప్రకారం విడాకులు పొందానని అన్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ లతోపాటు ఇద్దరు సాక్షుల ఎదుట నోటి మాటల ద్వారా కూడా తలాక్ చెప్పానని.. పైగా నిర్ణిత కాల పరిమితిని కూడా పాటించినట్లు ఆయన చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement