
సాక్షి, విశాఖపట్నం : అవినీతికి పాల్పడుతూ, అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను ఏసీబీ షాకించ్చింది. విశాఖపట్నం జిల్లా మదనపల్లె వీఆర్వో వెంకటేశ్వరరావు, మద్దెలపాలెం వీఆర్వో ఏవో వెంకటేశ్వరరావు, మాల్కాపురం సంజీవ్ కుమార్, జీవీఎంసీ 3వ జోన్ చైన్‌మన్ నాగేశ్వరరావుల ఇళ్లల్లో శుక్రవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఆదాయానికి మించి ఆస్తులు పోగేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.