
శ్వాసపరీక్ష నిర్వహిస్తున్న పోలీసులు
బంజారాహిల్స్: మద్యం సేవించి బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు నుంచి కేబీఆర్ పార్కు వైపు బైక్ వెళుతూ వాహనదారులు, పాదచారులను భయబ్రాంతులకు గురి చేస్తున్న మందుబాబును ట్రాఫిక్ పోలీసులు ఆపి శ్వాసపరీక్షలు నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెళుతూ ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురిచేసిన సతీష్ అనే వ్యక్తిని పరీక్షించగా 396 బీఏసీ నమోదైంది. వాహనాన్ని రెండు నెలల క్రితం కొనుగోలు చేయగా ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకపోగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.