టెర్రస్‌పై నుంచి దూకి వర్థమాన నటి ఆత్మహత్య

Actress Allegedly Jumps To Death From Mumbai Apartment Terrace - Sakshi

ముంబై : సినిమాల్లో నటించే అవకాశాలు రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వర్థమాన నటి అపార్టమెంట్‌ టెర్రస్‌ పై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ  సంఘటన గతరాత్రి ముంబైలోని ఒషివార ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలు పంజాబ్‌కు చెందిన నటిగా పోలీసులు గుర్తించారు. కాగా సినిమాల్లో ఛాన్స్‌ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  

అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గార్డ్‌ బిపిన్‌ కుమార్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ..‘ ఈ సంఘటన అర్థరాత్రి 12.15 నుంచి 12.30 మధ్యలో జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. అయితే ఎవరైనా రోడ్డుమీద గొడవ పడుతున్నారని అనుకున్నాం. ఏమైందా అని చూసేందుకు వెళ్లాను. ఇంతలో మూడో అంతస్తులో శబ్దం రావడంతో అక్కడకు వెళ్లి చూడగా యువతి కింద పడిపోయింది’ అని తెలిపాడు. కాగా  మానసికంగా కుంగుబాటుకు గురైన నటి తరచూ తల్లితో గొడవ పడుతూ ఉండేదని పోలీసులు వెల్లడించారు.  గతంలో కూడా ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు  తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top