‘ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్‌ ఉద్యోగులు’ | ACB Officers Raids On ICDS Employees In Vizianagaram | Sakshi
Sakshi News home page

‘ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్‌ ఉద్యోగులు’

Dec 16 2019 5:42 PM | Updated on Dec 16 2019 6:47 PM

ACB Officers Raids On ICDS Employees In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం: అవినీతికి పాల్పపడిన ఐసీడీఎస్‌ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డ ఘటన విజయనగరం జిల్లాలో చేటుచేసుకుంది. జిల్లాలోని కొత్తవలస ఐసీడీఎస్‌ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో శిశు సంక్షేమశాఖ సీడీపీఓ మణమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ వేణుగోపాల్‌ ఎసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాలు.. అంగన్‌వాడి సెంటర్లకు కిరాణా సరుకులు సరఫరా చేసే అడ్డూరి సురేష్‌ వద్ద నుంచి ఈ ఇద్దరు ఉద్యోగులు రూ.85 వేలు లంచం తీసుకుంటున్నారు. అదే సమయంలో దాడి చేసిన అధికారులు వారిని పట్టుకున్నారు. నవంబర్‌ నెల సరుకులు సరఫరాకి బిల్స్‌ చేసేందుకు చైల్డ్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్ మణమ్మ రూ.85 వేలు అడ్డూరి సురేష్‌ వద్ద లంచం అడిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement