తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు | Several killed in multiple vehicle collision in Tamilnadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు

Feb 20 2020 7:57 AM | Updated on Feb 20 2020 12:45 PM

Several killed in multiple vehicle collision in Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 24 మంది దుర‍్మరణం చెందారు. తిరుపూర్‌ జిల్లా అవినాషి వద్ద కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్‌ లారీ ఢీ కొనడటంతో 19మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుప్పుర్‌, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సేలం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు నేపాల్‌వాసులు మృతి చెందారు. ఓమలూరు వద్ద కారు, బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement