ఏడుగురు విద్యార్థుల దుర్మరణం | 7 Hislop students die in Amravati Road car crash | Sakshi
Sakshi News home page

ఏడుగురు విద్యార్థుల దుర్మరణం

Feb 18 2018 2:19 AM | Updated on Oct 19 2018 7:37 PM

7 Hislop students die in Amravati Road car crash - Sakshi

సాక్షి, ముంబై: కారు అదుపు తప్పడంతో అందులో షికారుకు బయలుదేరిన 8 మంది విద్యార్థుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని హిస్లాప్‌ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం ఎర్టిగా కారులో షికారుకు బయలుదేరారు.

నాగ్‌పూర్‌–అమరావతి రోడ్డుపై హైల్యాండ్‌ పార్క్‌ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న వీరి కారు అదుపు తప్పడంతో డివైడర్‌ను బలంగా ఢీకొని పక్కనే నిలిపి ఉంచిన ట్రక్కుకిందకు దూరిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు యువతులు సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. కారులో మద్యం, సిగరెట్లు లభించినప్పటికీ.. విద్యార్థులు మద్యం సేవించారన్న దానిపై ఎలాంటి స్పష్టతా లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement