మహిళా ఎస్‌ఐని కూడా వదిలి పెట్టలేదు..! | 3 arrested for molesting woman police | Sakshi
Sakshi News home page

మహిళా ఎస్‌ఐని కూడా వదిలి పెట్టలేదు..!

Dec 17 2017 1:19 PM | Updated on Sep 2 2018 5:04 PM

3 arrested for molesting woman police - Sakshi

సాక్షి, విదిశా: మధ్యప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు ఏ మాత్రం తగ్గడం లేదు. మైనర్‌ బాలికలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష లాంటి కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకు వచ్చినా అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు.

తాజాగా మధ్యప్రదేశ్‌లోని విదిశా పట్టణంలో.. ఒక మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ని ముగ్గురు వ్యక్తులు అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు గురి చేశారు. మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తలదగ్గర తుపాకి పెట్టి మరీ అత్యంత దారుణంగా, క్రూరంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.  మహిళా ఎస్‌ఐ గురించి అశ్లీలంగా, రాయడానికి, వినడానికి కూడా జుగుప్స కలిగించే భాషను ఉపయోగించినట్లు బాధిత మహిళా ఎస్‌ఐ చెప్పారు.


ఇదిలా ఉండగా.. బాధిత మహిళా ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులపై లైంగిక వేధింపులు,  ప్రభుత్వ అధికారిపై వేధింపులు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం వంటి నేరాలపై వారిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement