తిరుమలలో జిలెటిన్‌ స్టిక్స్‌ పట్టివేత | Tirumala gelatine sticks Capture | Sakshi
Sakshi News home page

తిరుమలలో జిలెటిన్‌ స్టిక్స్‌ పట్టివేత

Dec 17 2017 5:54 PM | Updated on Dec 17 2017 5:54 PM

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో విజిలెన్స్‌ అధికారులు జిలెటిన్‌ స్టిక్స్‌ పట్టుకున్నారు. వెంకట పథం రోడ్డులో 28 జిలెటిన్‌ స్టిక్స్‌,34 డిటోనేటర్స్ స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. పేలుడు పదార్ధాలన్నీ ఓ బ్యాగులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదు. ఇంజనీరింగ్ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లు తెప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంకటపథం మూడో విడత పనుల నిమిత్తం నిబంధనలకు వ్యతిరేకంగా తెప్పించారని ఆరోపణలు వస్తోన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement