10 వేల చుక్కల ముగ్గు..!

chittoor woman record muggu with 10,000 dots - Sakshi

చిత్తూరు గృహిణి రికార్డు

ప్రకృతిని కాపాడాలంటూ ముగ్గు ద్వారా సందేశం

సాక్షి, చిత్తూరు అర్బన్‌: ముగ్గులు మన సంప్రదాయ చిహ్నాలకు గుర్తులు. చిన్న పిల్లల నుంచి ప్రతీ ఒక్క మహిళ ముగ్గులు వేస్తుంటారు. చిత్తూరు నగరం దుర్గానగర్‌ కాలనీకు చెందిన సవిత అనే గృహిణి మాత్రం ముగ్గులు వేయడంలో రికార్డులు సృష్టిస్తుంటారు. గత 20 ఏళ్లుగా ముగ్గుల్లో ఉన్న అన్ని కోణాలను విశ్లేషించిన ఈవిడ కొత్తగా ఏదైనా రికార్డు సృష్టించాలనుకున్నారు. శనివారం చిత్తూరు నగరంలోని కట్టమంచిలో ఉన్న కళ్యాణ మండపం ఆవరణలో ఏకంగా 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 వేల చుక్కలతో ముగ్గువేసి సరికొత్త రికార్డు సృష్టించారు.

సవిత ఒక్కటే ఏడు గంటల పాటు శ్రమించి ముగ్గు వేయడం అక్కడున్న ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ముగ్గు మధ్యలో ప్రకృతిని కాపాడాలంటూ ఓ సందేశాన్ని సైతం ఇచ్చారు. ఆమె ముగ్గు వేస్తున్నంతసేపు అక్కడే ఉన్న తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధి శ్రీనివాసులు సవితను మెచ్చుకుంటూ తమ పుస్తకంలో ఆమెకు స్థానం లభించినట్లు పేర్కొన్నారు. ముగ్గు పూర్తయిన తరువాత సవితకు ధృవీకరణ పత్రం అందచేశారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top