గిన్నీస్‌ రికార్డు కోసం భరతనాట్య ప్రదర్శన

Bharatanatyam performance for the Guinness Book of Records - Sakshi

 రైతు శ్రమను చాటుతూ 300 మంది విద్యార్థుల నృత్యం

తిరుపతి కల్చరల్‌: గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో భాగంగా చేపట్టిన భరత నాట్య ప్రదర్శన ఆదివారం తిరుపతిలోని జీవకోన విశ్వం స్కూల్‌లో 300 మంది విద్యార్థులతో అద్భుతంగా సాగింది. రైతుల గురించి యువతకు తెలియజేయాలనే సంకల్పంతో హీడెన్‌ ఐడల్‌ సంస్థ వినూత్న రీతిలో ప్రపంచ వ్యాప్తంగా పదివేల మందితో భరతనాట్య ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. మలేసియా, దుబాయ్, ఆస్ట్రేలియా, లండన్, శ్రీలంక వంటి 8 దేశాలు, భారత్‌లోని 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ నృత్య ప్రదర్శనను నిర్వాహకులు చేపట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ నృత్య నిర్వాహకుడు డాక్టర్‌ శరత్‌చంద్ర పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్వీ యూనివర్సిటీ వీసీ ఆవుల దామోదరం, టీటీడీ ప్రాజెక్ట్‌ ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌ వైవీఎస్‌.పద్మావతి, రిటైర్డ్‌ అధ్యాపకుడు దేవేంద్ర, విశ్వ విద్యాసంస్థల అధినేత ఎన్‌.విశ్వనాథరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 12 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రికరించారు. అనంతరం జిల్లా రైతు ఉద్యమ నాయకుడు ఈగల వెంకటాచలం నాయుడును అతిథులు సత్కరించారు. 

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top